🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా.. ఈరోజు ఆదివారం గజలక్ష్మి గా భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణానికి చెందిన బొండాడ సుభద్రమ్మ మరియు కుటుంబ సభ్యులు అమ్మవారి అలంకరణకు కావలసిన ఉపకరణములు బహుకరించారు.
ఈసందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజలు నిర్వహించారు. భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో భక్తులు, వారి కుటుంబం వర్ధిల్లాలని అసిస్టెంట్ కమీషనర్ & కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్ మరియు చైర్మన్ బొండాడ నాగభూషణం ,ధర్మకర్తలు మండలి సభ్యులు కోరారు.
Mavullamma Shines as Gajalakshmi in Bhimavaram Temple Fete
Mavullamma at Ilavelpu temple dazzled devotees as Gajalakshmi during her annual festival on Sunday. Bhimavaram’s Bondada Subhadramma and family donated the ornate decorations. Head priest Brahmasri Maddirala Mallikharjuna Sharma conducted special pujas. Devotees received blessings and prasadam. AC & EO Budda Mahalakshmi Nagesh and chairman Bondada Nagabhushanam wished prosperity for all.

