🔴 ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల మండలం : కప్పలగుంట : ది డెస్క్ :
జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, డిఎస్పి శ్రావణ్ కుమార్ ఆదేశాలతో…

భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారక తిరుమల ఎస్ఐ సుదీర్ మరియు సిబ్బందితో కలిసి NH -16 కప్పులగుంట గ్రామములో రహదారి భద్రత అవగాహన కార్యక్రమం మరియు స్పెషల్ హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు.

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా భీమడోలు ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో భారీ ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించి హెల్మెట్లు ధరించనటువంటి వారిపై జరిమానాలను విధించకుండగా.. వాహన దారులతో భీమడోలు ఇన్స్పెక్టర్ 30 హెల్మెట్లను కొనుగోలు చేయించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ లేని వాహనదారులకు, సరైన పత్రాలు లేని వారికి రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా భీమడోలు ఇన్స్పెక్టర్ విల్సన్, ద్వారక తిరుమల ఎస్ఐ సుధీర్ మాట్లాడుతూ..
రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అత్యధికులు యువతే ఉండటం ఆందోళనకరమని, ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, నిర్లక్ష్యం, యువత థ్రిల్ కోసం బైక్ లను అతి వేగంగా నడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి నప్పుడు తలకు తగిలే చిన్న దెబ్బ కూడా ప్రాణాంతకం కావచ్చని, హెల్మెట్ ధరించడం వల్ల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు.
సూచనలు & హెచ్చరికలు :
▪️ ద్విచక్ర వాహనంపై వెళ్లే టప్పుడు తప్పని సరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించండి.
▪️ మైనర్లకు వాహనాలు ఇచ్చి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేయకండి.
▪️ ఎవరైనా మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే వారి యొక్క తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినారు.
▪️ మీ ప్రయాణం సురక్షితం కావాలి. మీ కుటుంబం మీకోసం ఎదురు చూస్తోంది. ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించండి అని విజ్ఞప్తి చేసారు.
Eluru Cops Launch Helmet Drive to Boost Road Safety on NH-16
In a proactive move to curb road accidents, Eluru District SP Prathap Shiv Kishore and DSP Shrawan Kumar directed a special helmet drive and awareness program on NH-16 at Kapplagunta village. Bhimadole Inspector Wilson, along with Dwaraka Tirumala SI Sudheer and their teams, engaged two-wheeler riders without helmets or valid documents.
Focusing on prevention over fines, Inspector Wilson personally facilitated the purchase of 30 helmets for non-compliant riders, emphasizing education on helmet importance.
Speaking on the occasion, Inspector Wilson lamented the high youth fatalities from speeding, negligence, and thrill-seeking rides, which endanger others too. “A minor head injury can be fatal; helmets significantly reduce deaths,” he stressed.
Key Advisories :
▪️Always wear quality helmets on two-wheelers.
▪️Don’t hand vehicles to minors—parents face action too.
▪️Follow traffic rules for safe journeys; your family awaits you.
Police urged public cooperation in these safety initiatives.

