🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు :
బాధంపూడి/ఉప్పాకపాడు : ది డెస్క్ :

“విధుల్లోకి-వీదుల్లోకి – స్వచ్ఛరథం పర్యటన” అనే నూతన విధానంతో గ్రామాల్లో ప్లాస్టిక్, పొడి చెత్త కనిపించకుండా చూడాలనే ప్రభుత్వ సంకల్పంతో ఉంగుటూరు మండలంలోని బాధంపూడి, ఉప్పాకపాడు గ్రామాల్లో శుక్రవారం స్వచ్ఛరథం పర్యటించింది. గ్రామస్తుల నుంచి పొడి చెత్త, ప్లాస్టిక్ వస్తువులు సేకరించిన ఈ కార్యక్రమం ప్రజల్లో అవగాహన కలిగించి, గ్రామాలను స్వచ్ఛంగా మార్చేందుకు బలమైన అడుగుగడక్కను పెట్టింది.ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ఈ “విధుల్లోకి-వీదుల్లోకి” విధానం ద్వారా గ్రామాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు వేగవంతం కావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ… వారి నుంచి చెత్తను సేకరించి, దాన్ని ప్రక్రియపరచి ఆదాయం చేకూర్చేలా చేయాలనే ఈ కార్యక్రమం రెండు గ్రామాల్లో విజయవంతమైంది. స్థానిక మహిళలు, యువకులు భారీ సంఖ్యలో పాల్గొని, తమ ఇళ్ల నుంచి ప్లాస్టిక్ ప్యాకెట్లు, పాత కాగితాలు, ఇతర పొడి చెత్తను స్వచ్ఛరథానికి అందజేశారు. సేకరణలో భాగంగా సుమారు 500 కేజీల చెత్త వ్యవస్థీకృతంగా సమీకరించారు.
పంచాయతీ అధికారి మాట్లాడుతూ..
“ఈ కార్యక్రమం గ్రామాల్లో స్వచ్ఛత అవగాహనను పెంచుతోంది. ప్రజలు తమ చెత్తను సేకరణకు అందించడం ద్వారా గ్రామం కచ్చితంగా పరిస్థితులు మారతాయి. మిగిలిన గ్రామాల్లో కూడా ఈ స్వచ్ఛరథం చేరుకుంటుంది” అని తెలిపారు. గ్రామస్తులు కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతించారన్నారు.
బాధంపూడి స్థానిక గ్రామస్తురాలు ఒకరు మాట్లాడుతూ..
“మా గ్రామం ఇక స్వచ్ఛంగా మారుతుంది. చెత్త సేకరణకు డబ్బు కూడా వస్తుందని తెలుస్తే మరింత ఉత్సాహం” వస్తుందని అన్నారు.
ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమం విస్తరణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యావరణ సమస్యలను తగ్గించి, ప్రజలకు ఆర్థిక లాభం చేకూర్చే ఈ విధానం జిల్లా స్థాయిలో మోడల్‌గా మారనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో స్వచ్ఛత ఉద్యమం కొత్త రూపం సంతరించుకుంటుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా గ్రామాల్లో మహిళలు, ప్రజలు స్వచ్ఛరధానికి – బ్రహ్మరథం పట్టడం పట్ల పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

