The Desk… Bhimavaram  : మావుళ్ళమ్మకు 160 కేజీల భారీ గజమాల

The Desk… Bhimavaram : మావుళ్ళమ్మకు 160 కేజీల భారీ గజమాల

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

మావుళ్లమ్మ అమ్మవారికి ఆకివీడు పూలు మరియు పండ్ల వ్యాపారస్తుల సంఘం ప్రెసిడెంట్ Sk బాజి ఆధ్వర్యంలో సుమారు 160 కేజీల వివిధ రకముల పూలతో భారీ గజమాల సమర్పించారు. 24 సంవత్సరాలనుండి అమ్మవారికి వార్షిక మహోత్సవాలలో గజమాల సమర్పిస్తున్నట్లు ప్రెసిడెంట్ మరియు సభ్యులు తెలియపారు. ఆలయ అర్చకులు వీరికి పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, జ్ఞాపిక అందచేసారు.

ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు రామాయణం శ్రీనివాస్ పాపొలు ఏడుకొండలు మరియు ఆకివీడు పూల పండ్లు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Bhimaavaram Florists Offer 160kg Floral Tribute to Mavullamma

The Akividu Flowers and Fruits Traders Association, led by President SK Baaji, presented a massive 160kg garland of assorted flowers to Goddess Mavullamma at her temple. This 24-year tradition during annual festivals continues. Priests performed rituals and blessings, while Devasthanam Commissioner Budda Mahalakshmi Nagesh offered sacred cloth and honors. Dharma Karthas and traders attended.