🔴 ఏలూరు జిల్లా : ది డెస్క్ :
యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఐటి విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన ఎంపీ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ప్రజా చైతన్యమే లక్ష్యంగా యువగళం సాగిందని చెపుతూ, లోకేష్‌తో కలసి తాను కూడా పాదయాత్రలో నడిచిన రోజులను గుర్తుచేసుకున్నారు.
2023 జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్ల మేర కొనసాగింది. లోకేశ్ పాదయాత్ర నిర్వహించిన 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడం ఈ యాత్ర విజయానికి నిదర్శనంగా నిలిచిందన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
వైసీపీ ప్రభుత్వ, నాయకుల అరాచకాలు, దాడులతో రాష్ట్రం కల్లోలంగా మారిన పరిస్థితుల్లో ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్తైర్యం నింపి, 2024 ఎన్నికల్లో విజయానికి బాటలు వేసిన యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా మిగిలిపోతుందన్నారు. ఈ యాత్ర స్ఫూర్తితో తామంతా నిరంతరం ప్రజల్లో ఉంటూ, రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములై పనిచేస్తామని చెబుతూ ఈ సందర్భంగా యువనేత నారా లోకేష్‌కు ఏలూరు ఎంపీ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.
Yuva Galam, changed the scenario of the state – MP Putta
On the occasion of the completion of three years of the Yuva Galam padayatra, Eluru MP Putta Mahesh Kumar extended his congratulations to the State IT and Education Minister Nara Lokesh. In a statement released to this effect, the MP said that the Yuva Galam padayatra, aimed at raising public awareness, reflected the hopes and aspirations of millions of people in the state, and recalled the days when he too walked alongside Lokesh during the padayatra. The Yuva Galam padayatra, which started in Kuppam on January 27, 2023, continued for 226 days, covering 3,132 kilometers across 97 assembly constituencies in 11 undivided districts. MP Putta Mahesh Kumar stated that the victory of alliance candidates in 90 out of the 97 assembly constituencies where Lokesh conducted the padayatra stands as a testament to the success of this journey. He said that the Yuva Galam padayatra, which instilled confidence in the people and party workers during a time when the state was in turmoil due to the atrocities and attacks by the YSRCP government and its leaders, and paved the way for victory in the 2024 elections, will remain a great chapter in the political history of Andhra Pradesh. Stating that they will continue to be among the people and participate in the reconstruction of the state with the inspiration from this journey, the Eluru MP once again extended his congratulations to the young leader Nara Lokesh on this occasion.

