🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : చేబ్రోలు : ది డెస్క్ :
చేబ్రోలు గ్రామపంచాయతీ పరిధిలో సుప్రీం ఎల్ టి సి కేంద్రంలో జరుగుతున్న మూడు రోజుల రెసిడెన్షియల్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ సీఈవో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గ్రామాలు చూడటానికి పరిశుభ్రంగా ఉండాలని, ఈ విషయంలో పారిశుధ్య కార్మికులు/ క్లాప్ మిత్రులు, సిఆర్పిలు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని కనుక వారిని కూడా శిక్షణ కార్యక్రమాలతో మంచిగా తీర్చిదిద్దినట్లయితే వారు విధులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారని.. అంతేకాకుండా గ్రామస్తులు ఆరోగ్యాన్ని పరోక్షంగా కాపాడుతున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం యెడల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా వారు విధులకు ఆటంకం కలగకుండా ఉంటుందని ఆయన సూచించారు.
అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం నిధుల్లో కచ్చితంగా పారిశుధ్య కార్మికులందరికీ జీతాలు సకాలంలో ఇచ్చే విధంగా సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శి లు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన తెలియపరిచారు.
అదే విధంగా గ్రామస్తులు కూడా పారిశుధ్య కార్మికులు ఇంటింటా చెత్త సేకరణకు వచ్చినప్పుడు వారి యెడల గౌరవం చూపిస్తూ తడిచెత్త – పొడిచెత్త వేరువేరుగా ఇచ్చినట్లయితే దానిని త్వరగా వేరుచేయటం ఎక్కువ అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎంపీడీవో జి ఆర్ మనోజ్, డిప్యూటీ ఎంపీడీవోలు వివిధ మండలాల నుంచి వచ్చిన పంచాయతీ కార్యదర్శులు సిఆర్పిలు జిల్లా శిక్షణ కేంద్రం డి పి ఆర్ సి ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.
Cleanliness a Continuous Process: ➖ZP CEO M.Srihari
Emphasizing sustained cleanliness efforts, District Panchayat CEO M. Srihari urged panchayat officials to prioritize training for sanitation workers, CLAP friends, and CRPs during the valedictory of a three-day residential training at Supreme LTC Centre under Chebrolu Gram Panchayat.
Speaking on the occasion, Srihari stressed that villages must remain spotless, with trained workers performing duties more efficiently. He advised panchayat secretaries and sarpanches to ensure sanitation workers’ health to avoid disruptions, and to disburse 15th Finance Commission funds as timely salaries.
He also appealed to villagers to respect workers during door-to-door waste collection by segregating wet and dry waste, aiding quick processing.
Unguturu MPDO G.R. Manoj, deputy MPDOs, panchayat secretaries, CRPs, and DPRC representatives attended.

