The Desk… Mudinepalli : అమరావతి నిర్మాణానికి మేము సైతం అంటూ కదలి వచ్చిన ఆర్యవైశ్యులు..!!

The Desk… Mudinepalli : అమరావతి నిర్మాణానికి మేము సైతం అంటూ కదలి వచ్చిన ఆర్యవైశ్యులు..!!

🔴 ఏలూరు జిల్లా : ముదినేపల్లి మండలం : ది డెస్క్ :

ముదినేపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి దేవస్థానంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా.. ఆర్యవైశ్యులకు మరియు ఎన్ డి ఏ నాయకులకు పాదాలు కడిగి సత్కరించిన ముదినేపల్లికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మనోజ్.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు భక్తులు, ఆర్యవైశ్యులు 116/-రూపాయలు అమరావతికి సాయం చేద్దాం అనే కాన్సెప్ట్ లో భాగంగా వందమంది 116/- రూపాయలు అమరావతి నిర్మాణానికి క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు చేశారు. మరియు రెండు రోజుల్లో మరొక వందమంది అమరావతి నిర్మాణానికి 116 రూపాయలు చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ డాక్టర్ మనోజ్ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా దీనిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని ఆర్యవైశ్యులు అందరూ అమరావతి నిర్మాణానికి సహకరించాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్ విజ్ఞప్తి చేశారు.

Arya Vysyas Rally for Amaravati Construction at Mudinepalli Event

In a spirited show of support, Arya Vysyas declared, “We’re also coming forward for Amaravati’s construction!” at the Vasavi Mata Atmarpanotsavam held at Anjaneya Swamy Temple in Mudinepalli village.

Prominent local doctor Manoj, hailing from Mudinepalli, honored Arya Vysyas and NDA leaders by washing their feet. Over 100 devotees contributed ₹116 each via QR code toward Amaravati’s development, with another 100 pledging the same within two days.

Dr. Manoj, father of Amaravati Brand Ambassador Ambula Vaishnavi, expressed gratitude and urged all Arya Vysyas across Andhra Pradesh to follow suit as a model initiative.