The Desk … Rajamahendravaram: భోగి–సంక్రాంతి–కనుమ పండుగ మూడు రోజులూ రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

The Desk … Rajamahendravaram: భోగి–సంక్రాంతి–కనుమ పండుగ మూడు రోజులూ రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన

🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ప్రత్యేక డ్రైవ్ – కారు, ఆటో, ద్విచక్ర వాహనదారులకు సూచనలు

హెల్మెట్, సీట్‌బెల్ట్ ధారణ లో నిర్లక్ష్యం ప్రాణాలకే ప్రమాదం
➖జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం 2026 (National Road Safety Month–2026) కార్యక్రమాల్లో భాగంగా, భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మూడు రోజుల పాటు రాజమహేంద్రవరం నగరంలో విస్తృత స్థాయిలో రహదారి భద్రత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు.

పండుగల వేళ కుటుంబ సభ్యులతో కలిసి ప్రజలు పెద్ద ఎత్తున బయటకు రావడంతో రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. బుధ, గురు, శుక్రవారాలలో నగరంలోని మోరంపూడి, బొమ్మూరు, కంబాలచెరువు తదితర ప్రాంతాల్లోని ట్రాఫిక్ జంక్షన్లను రవాణా శాఖ అధికారులు సందర్శించి, ప్రజలకు నేరుగా అవగాహన కల్పించారు.

NRSM–2026లో భాగంగా బొమ్మూరు ట్రాఫిక్ జంక్షన్ వద్ద ఆటో రిక్షా వాహనదారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించగా, అధిక సంఖ్యలో ప్రయాణికులను తరలించడం నిషేధమని స్పష్టం చేశారు. అలాగే ఆటో రిక్షా వాహనాలకు సంబంధించిన పర్మిట్, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్షూరెన్స్ వంటి పత్రాలు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రాముఖ్యత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అవసరంపై వాహనదారులకు అవగాహన కల్పించారు.

సందర్భంగా జిల్లా రవాణా అధికారిఆర్. సురేష్ మాట్లాడుతూ..

“హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్‌బెల్ట్ ధరించకపోవడం వంటి చిన్న నిర్లక్ష్యాలు పండుగ ఆనందాన్ని క్షణాల్లో దూరం చేసి, జీవితాంతం మిగిలిపోయే చేదు అనుభవంగా మారుతాయి. మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది. మీ కోసం, మీ కుటుంబ సంక్షేమం కోసం రహదారి భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి” అని అన్నారు. శిరస్త్రాణం, సీట్‌బెల్ట్ ధారణ తప్పనిసరి అని ఆయన మరోసారి గుర్తు చేశారు.

ఈ అవగాహన కార్యక్రమాల్లో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి.హెచ్. సంపత్ కుమార్, ఎం. రవి కుమార్, జి. రామ్ నారాయణ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు బి. ఉమా మహేశ్వర రావు, జి. ప్రణీత్ కుమార్, పి.వి.వి. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Intensive Road Safety Awareness During Bhogi-Sankranti-Kanuma Festivals.

Special Drive at Traffic Junctions Advises Car, Auto, Two-Wheeler Drivers Neglecting Helmets, Seatbelts Endangers Lives

—District Transport Officer R. Suresh

As part of National Road Safety Month-2026, transport authorities in Rajamahendravaram conducted extensive road safety awareness campaigns over three days—Bhogi, Sankranti, and Kanuma—to ensure safer travels amid festival rush.

With families heading out in large numbers, officials focused on high-traffic areas like Morampudi, Bommuru, and Kambalacheruvu junctions on Wednesday, Thursday, and Friday. Teams directly engaged drivers, emphasizing rule compliance.

At Bommuru junction, a special drive targeted auto-rickshaw operators, prohibiting overloading of passengers. Authorities stressed mandatory documents—permits, fitness certificates, driving licenses, and insurance—along with responsible driving practices.

District Transport Officer R. Suresh urged :

“Riding without a helmet or skipping seatbelts turns festive joy into lifelong tragedy in moments. Your safety is in your hands—follow rules for yourself and your family.” He reiterated helmets and seatbelts as non-negotiable.

The drives saw participation from Motor Vehicle Inspectors C.H. Sampath Kumar, M. Ravi Kumar, G. Ram Narayan; Assistant Inspectors B. Uma Maheshwara Rao, G. Praneeth Kumar, P.V.V. Sai Kumar, and others.