The Desk … Nellore : మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి ఆనం

The Desk … Nellore : మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి ఆనం

🔴 నెల్లూరు : ది డెస్క్ :

మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మరణం పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఆనం ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఎన్టీ రామారావు హయాంలో సహచర ఎమ్మెల్యేగా, సహచర మంత్రిగా కలిసి పని చేసిన రోజులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

అప్పలసూర్యనారాయణ ప్రజాసేవకు అంకితమైన నేతగా, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతలకు ప్రతీకగా నిలిచారని మంత్రి ఆనం పేర్కొన్నారు.
తనతో కలిసి పని చేసిన కాలంలో గుండ అప్పలసూర్యనారాయణ స్పష్టమైన రాజకీయ దృక్పథం, ప్రజల పట్ల ఉన్న బాధ్యత, నిబద్ధత ఎప్పటికీ మరచిపోలేనివని మంత్రి ఆనం తెలిపారు.

ఆయన మృతి రాజకీయ రంగానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుఃఖకర సమయంలో వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రార్థించారు.