The Desk…Rahamahendravaram : రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన➖జిల్లా రవాణాశాఖ అధికారి ఆర్ సురేష్

The Desk…Rahamahendravaram : రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన➖జిల్లా రవాణాశాఖ అధికారి ఆర్ సురేష్

🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు (NRSM)-2026 కార్యక్రమాల్లో భాగంగా.. గురువారం రాజమహేంద్రవరం నగరంలోని తిరుమల విద్యా సంస్థలో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రత ప్రాముఖ్యత, పాదచారులు, సైకిల్‌ దారులు, వాహనదారులు పాటించాల్సిన నియమాలు, ప్రమాద నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు భద్రత నియమాలను వివరించారు. అలాగే ఆదిత్య డిగ్రీ కళాశాల వాలంటీర్లు రూపొందించిన అవగాహన వీడియోలను ప్రదర్శించారు. విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా ఇంటరాక్టివ్ క్విజ్ పోటీ నిర్వహించారు. “Seekh se Suraksha – Technology se Parivartan” అనే సందేశాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా రోడ్డు భద్రతపై ఫ్లాష్ మాబ్ డాన్స్‌ను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉమా మహేశ్వర రావు, ప్రణీత్ కుమార్, తిరుమల విద్యా సంస్థ ప్రధానోపాధ్యాయులు శ్రీహరి, ఆదిత్య డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ & ఎన్ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ జి.ఎస్. నాగేశ్వర రావు, రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస రావు మరియు తిరుమల ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన సుమారు 300 మంది విద్యార్థులు, ఆదిత్య డిగ్రీ కళాశాల వాలంటీర్లు 30 మంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి విజయవంతంగా నిర్వహించారు.

Road Safety Awareness Program Engages Rajamahendravaram Students

As part of National Road Safety Month (NRSM)-2026, district transport official R. Suresh led an awareness program Thursday at Tirumala Vidya Institutions here, educating students on road safety rules.

Around 300 students learned pedestrian, cyclist, and vehicle protocols, accident prevention, via PowerPoint presentations and videos by Aditya Degree College volunteers. An interactive quiz and flash mob dance promoted the theme “Seekh se Suraksha – Technology se Parivartan.

“Motor Vehicle Inspector Sampath Kumar, Assistants Uma Maheshwara Rao and Praneeth Kumar, principal Srihari, NSS coordinator G.S. Nageswara Rao, Rotary Club president Srinivas Rao, and 30 volunteers coordinated the event successfully.