The Desk… Vunguturu : పారిశుధ్యం నిమిత్తం ఐదు పుష్ కార్డ్స్ పంపిణీ.

The Desk… Vunguturu : పారిశుధ్యం నిమిత్తం ఐదు పుష్ కార్డ్స్ పంపిణీ.

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

బుధవారం స్వచ్ఛందర కార్పొరేషన్ నుంచి ఉంగుటూరు మండలంకు కేటాయించిన ఐదు పుష్కార్ట్లను (తోపుడుబళ్లను) మండలంలోని పారిశుధ్య రిక్షాలు కొరత ఉన్న చిన్న పంచాయతీలైన…తల్లాపురం, నీలాద్రిపురం, ఉప్పాకపాడు, కంసాలికుంట, అప్పారావుపేట గ్రామపంచాయతీలకు పంపిణీ చేయడం జరిగింది.

వీటితోపాటు నాలుగు డస్ట్ బిన్నులను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఒకటి పచ్చ రంగు డస్ట్ బిన్ – దీనిలో తడిచెత్త, మరొకటి నీలం రంగు డస్ట్ బిన్.. నీలం రంగు డస్ట్ బిన్ లో పొడి చెత్త, ఎరుపు రంగు డస్ట్ బిన్ లో హానికరమైన వస్తువులు వేసుకొనే నిమిత్తం.. పైన పేర్కొన్న గ్రామపంచాయతీలకు ఇవ్వడం జరిగింది. వీటిని ఆయా గ్రామపంచాయతీలు, క్లాప్ మిత్రాలు నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీఓ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు డిప్యూటీ ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.