The Desk… Aalamuru : వికసిత్ భారత్ – జి రామ్ జి

The Desk… Aalamuru : వికసిత్ భారత్ – జి రామ్ జి

🔴 కోనసీమ జిల్లా :ఆలమూరు మండలం : ది డెస్క్ :

పెదపళ్ళ సచివాలయంలో సెక్రటరీ వేణి ,సర్పంచ్ సత్యశ్రీ మెహర్ ప్రసాద్ ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతలూరు నీటి సంఘం అధ్యక్షలు గారపాటి శ్రీనివాస్, సొసైటీ అధ్యక్షలు జాస్తి భాస్కరరావు, పాల్గొన్నారు.

సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ..

ఉపాధి హామీ పథకంలో ఇంతవరకు వంద రోజులు పని ఉంటే కేంద్ర ప్రభుత్వం పేరు మార్చి వికసిత్ భారత్- జి రామ్ జి అనే పేరును నామకరణం చేసి 100 రోజులు పనిని 25 రోజులుగా పెంచి ప్రజలకు మరింత చేయూతనిచ్చిందని తెలిపారు. అంతేకాకుండా నూతన సంవత్సరంలో స్వచ్ఛ సంక్రాంతికి ప్రజల రోడ్లపై చెత్త వేయకుండా చూసుకొని స్వచ్చభారత్ గా మలచాలని కూటమి ప్రభుత్వం ప్రజలకు గ్రామ సభలో తెలియజేసింది.

ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ నెక్కంటి ప్రమీల ప్రకాష్, గ్రామ రైతులతో పాటు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Viksit Bharat-Ji Ramji Gram Sabha Held in Pedapalli

A gram sabha under the “Viksit Bharat-Ji Ramji” initiative was organized at the Pedapalli secretariat in Alumuru mandal, led by Secretary Veni and Sarpanch Satyashri Mehar Prasad. Key guests included Chintaluru Water Society President Garapati Srinivas and Society President Jasti Bhaskar Rao.

Coalition leaders highlighted that the Centre has renamed the MGNREGA scheme to Viksit Bharat-Ji Ramji, increasing work days from 100 to 125 to provide greater support to people. They urged villagers to maintain clean roads ahead of Sankranti for a Swachh Bharat, avoiding littering.

MPTCS Nekkanti Prameela Prakash, local farmers, and secretariat staff attended the event.