🔴 తూగో జిల్లా : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవ వేడుకల్లో భాగంగా, ఈ రోజు 04-01-2026 న రాజమహేంద్రవరంలోని మోరంపూడి ట్రాఫిక్ జంక్షన్ ను ఆదిత్య కళాశాల విద్యార్థులతో మరియు పోలీస్ సిబ్బందితో, నేషనల్ హైవే సిబ్బందితో, ఫ్రెండ్స్ సర్వీసెస్ అసోసియేషన్ బృందంతో కలసి వాహనదారులకు అవగాహన కల్పించారు.

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవం (NRSM) – 2026 కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలోని మోరంపూడి ట్రాఫిక్ జంక్షన్ వద్ద ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని మరియు కార్లలో ప్రయాణించే ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరిగా ఉండాలని రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది, దీనిలో భాగంగా ఫ్రెండ్స్ సర్వీసెస్ అసోసియేషన్ బృందం ద్విచక్ర వాహనదారులకు గులాబీలను అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో..రవాణా అధికారులు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సి. హెచ్. సంపత్ కుమార్, మరియు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, జి ప్రణీత్ కుమార్, బి ఉమా మహేశ్వర రావు,కే చైతన్య, సుమ మరియు ఇతర శాఖ అధికారులు ఎస్పీ గంగిరెడ్డి డైరెక్టర్ ఆదిత్య కళాశాల, సి. హెచ్. ఫణి కురం ప్రిన్సిపాల్, ఎం.చంద్రశేఖర్ ప్రిన్సిపాల్, కెవి శ్రీరామ్ ప్రిన్సిపాల్, కె . సుధాకర్ పట్నాయక్ FSS సభ్యుడు, ఎన్.ఎస్.ఎస్. కోఆర్డినేటర్ బి. రామకృష్ణ, మరియు జీ.జే,సీ.ఎల్. శ్రీనివాస్ రోటరీ క్లబ్ అధ్యక్షుడు, డా జి.వి.స్ నాగేశ్వరరావు NSS కోఆర్డినేటర్, బి. విమల ప్రోగ్రాం అధికారి, బి.కిరణ్ సిబ్బంది పాల్గొన్నారు.
National Road Safety Month Awareness Drive Held in Rajamahendravaram
In a vibrant push for road safety, students from Aditya College, police personnel, National Highway staff, and the Friends Services Association (FSS) teamed up at Morampudi Traffic Junction here today to educate motorists during National Road Safety Month (NRSM) 2026 celebrations.The awareness drive emphasized mandatory helmet use for two-wheeler riders and seat belts for car passengers. FSS volunteers distributed roses to compliant bikers, adding a symbolic touch.
Key participants included Motor Vehicle Inspector C.H. Sampath Kumar, Assistant MVIs G. Praneeth Kumar, B. Uma Maheshwar Rao, K. Chaithanya, and Suma; Aditya College Director SP Gangireddy; principals C.H. Phani Kuram, M. Chandrashekar, and KV Sriram; FSS member K. Sudhakar Patnayak; NSS coordinator B. Ramakrishna; Rotary Club president G.J., C.L. Srinivas; NSS coordinator Dr. G.V.S. Nageshwar Rao; program officer B. Vimal; and staffer B. Kiran.
Transport officials urged stricter adherence to save lives.

