The Desk…Aalamuru : రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలు “భూ” యజమానుల హక్కు

The Desk…Aalamuru : రాజముద్ర తో కూడిన పాస్ పుస్తకాలు “భూ” యజమానుల హక్కు

  • పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు

🔴 కోనసీమ జిల్లా : ఆలమూరు మండలం : చింతలూరు : ది డెస్క్ :

ప్రభుత్వ నూతనంగా అందిస్తున్న రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు రైతన్నల ఆస్తులకు పరిరక్షణగా నిలుస్తాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం చింతలూరులో శనివారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రెవెన్యూ గ్రామసభలు, పట్టాదారు పాస్ పుస్తకాలు వంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు.

సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

గత వైసిపి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతుల యాజమాన్య హక్కులను కాలరాసేలాగ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గత ప్రభుత్వం తీసుకువచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. పాస్ బుక్ ల పంపిణీ పేరుతో, సర్వేల పేరుతో అనేక అవకతవకలు జగన్ ప్రభుత్వం చేసిందన్నారు. ప్రజలకు తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తులపై హక్కును కాలదన్నేలా వ్యవహరించిందని అన్నారు. జగన్ తన సొంత ఫోటోలతో, తన పార్టీ రంగులద్ది తప్పుల తడకల పాసు పుస్తకాలు ప్రజలకు ఇచ్చారని విమర్శించారు. వాటిలో కూడా అనేక తప్పులు దొర్లాయని అన్నారు.

కూటమి ప్రభుత్వం హయంలో రాజముద్రతో పట్టాదారు పాను పుస్తకాలు అందిస్తున్నామన్నారు. ప్రతి పట్టాదారు పాసు పుస్తకం మీద క్యూఆర్ కోడ్ ఉందని ఆ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే మీ భూమి లొకేషన్ ఎక్కడ ఉందో తెలుస్తుందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించి డిజిటలైజేషన్ చేసి భూ యజమానుల హక్కులు పరిరక్షించడం జరిగిందన్నారు. వైసీపీ పాలనలో తలెత్తిన రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

ఈ కార్యక్రమానికి చింతలూరు నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్, టిడిపి మండల అధ్యక్షుడు సత్తిబాబు, దండంగి మమత తదితరులు పాల్గొన్నారు.

Rajamudra Pattadar Passbooks Safeguard Farmers’ Land Rights
➖Bandaru MLA

Newly issued pattadar passbooks with the official Rajamudra seal will protect farmers’ property rights, said Kothapeta MLA Bandaru Satyanarayana Rao. He participated in the Revenue Department’s gram sabha and passbook distribution program in Chintaluru, Alamuru Mandal, on Saturday, handing over the documents to local farmers.

Speaking on the occasion, the MLA criticized the previous YSRCP government’s Land Titling Act as an attempt to erode landowners’ rights, which the TDP-led coalition revoked upon coming to power. “Under Jagan’s regime, surveys and faulty passbooks—with his photo and party colors—caused chaos, stripping ancestral properties,” he charged. The new passbooks feature QR codes; scanning them reveals exact land locations via technology-driven digitization, he added.

The coalition government is resolving revenue issues from YSRCP’s tenure, Rao assured. Chintaluru Water Committee President Garapati Srinivas, TDP Mandal leader Sattibabu, Dandangi Mamata, and others attended.