The Desk…Rajamahrndravaram : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – అవగాహన సదస్సులు

The Desk…Rajamahrndravaram : జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – అవగాహన సదస్సులు

🔴 తూగో : రాజమహేంద్రవరం : ది డెస్క్ :

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమాలు
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం (NRSM)–2026 కార్యక్రమాలలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం నగరంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ తెలిపారు.

ఈ సందర్భంగా శనివారం రాజమహేంద్రవరం APSRTC డిపోను సందర్శించి, అక్కడ శిక్షణ పొందుతున్న డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రైవర్లు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
అలాగే రాజమహేంద్రవరం హుకుంపేటలోని డి–మార్ట్ సమీపంలో రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తూ రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేసి, వారికి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు సి.హెచ్. సంపత్ కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు జి. ప్రణీత్ కుమార్, బి. ఉమా మహేశ్వర రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.