The Desk…Eluru : కొమ్మూరి నగేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీడీ శ్రీనివాస విశ్వనాధ్

The Desk…Eluru : కొమ్మూరి నగేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీడీ శ్రీనివాస విశ్వనాధ్

🔴 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

ఆకస్మికంగా మరణించిన ఏలూరు డివిజనల్ పంచాయతీ అధికారి కార్యాలయ సిబ్బంది కొమ్మూరి నగేష్ కుటుంబ సభ్యులను పూర్వపు ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి మరియు రంపచోడవరం అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, డ్వామా తూతిక శ్రీనివాస విశ్వనాధ్ శైలజ దంపతులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆఫీస్ సబర్డినేటుగా ఏలూరు డిఎల్పిఓ కార్యాలయంలో పనిచేస్తున్న నగేష్ గుండెపోటుతో ఈ నెల డిసెంబర్, 28 తేదీన మరణించిన సంగతి తెలిసిందే. నగేష్ కు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానిక ఆర్ ఆర్ పేటలో నివాసం ఉంటున్న నగేష్ గృహానికి వెళ్లి నగేష్ మరణంతో దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు.

సందర్భంగా శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ..

పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటులో 29 సంవత్సరాలు విశేష సేవలందించిన నగేష్ చిన్న వయసులో తన 48వ ఏటా చనిపోవడం చాలా బాధాకరమని, నిబద్దతతో, అంకిత భావంతో విధులు నిర్వహించిన నగేష్ మరణం పంచాయతీ రాజ్ డిపార్ట్మెంటుకు తీరని లోటని, ప్రభుత్వం అన్ని విధాలా నగేష్ కుటుంబాన్ని ఆదుకుంటుందని శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఏపీడీతో పంచాయతీ విశ్రాంత కార్యదర్శి ఠాగూర్ ఉన్నారు.

Former Eluru DRO Srinivas Viswanath Consoles Kommuri Nagesh’s Family

Former Eluru District Panchayat Officer and Rampachodavaram Assistant Project Director (DRDA) Srinivas Viswanath, along with his wife Shilaja, visited the bereaved family of Kommuri Nagesh, a 48-year-old staff member at the Eluru Divisional Panchayat Officer’s office who died of a cardiac arrest on December 28.

Residing in RR Pet, Nagesh leaves behind his wife and two sons. The couple offered condolences at his home, comforting the grieving family.

Speaking on the occasion, Srinivas Viswanath said, “Nagesh served the Panchayat Raj Department for 29 years with dedication. His untimely death is a huge loss; the government will support his family fully.” He noted former Panchayat Secretary Tagore’s association with APD.