The desk…Machilipatnam : జిల్లా ముఖ్య కేంద్రంలో హెల్త్ ఆఫీసర్ను నియమించాలి…లంకిశెట్టి డిమాండ్

The desk…Machilipatnam : జిల్లా ముఖ్య కేంద్రంలో హెల్త్ ఆఫీసర్ను నియమించాలి…లంకిశెట్టి డిమాండ్

కృష్ణాజిల్లా : మచిలీపట్నం : ది డెస్క్ :

కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రం మచిలీపట్నం కార్పొరేషన్ లో ఎంతోకాలంగా ఖాళీగా ఉన్న హెల్త్ ఆఫీసర్ పోస్టును తక్షణమే భర్తీ చేయాలని జిల్లా కలెక్టర్ ను మచిలీపట్నం అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ డిమాండ్ చేశారు. సోమవారం మచిలీపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ మచిలీపట్నంలో బిర్యాని పాయింట్లు, ఐస్ క్రీమ్ బళ్ళు, బాదంపాలు బళ్ళు విపరీతంగా పెరిగిపోయి నిలవ మాంసంతో కల్తీ పిండి పదార్థాలతో వంటలు చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న హోటల్లో రెస్టారెంట్లపై పర్యవేక్షణ చేయడానికి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ లేకపోవడం దారుణమని బాలాజీ విమర్శించారు.

ఇన్నదురుపేటలోని కబేలాని ఎప్పుడో మూసివేసారని, అనధికారికంగా మేక మాంసాన్ని అమ్ముతూ అధికారులు చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు సమంజసం అని బాలాజీ ప్రశ్నించారు. గతంలో పురపాలక సంఘం స్టాంపింగ్ లేకుండా మాంసం అమ్మకాలు జరిగేవి కావని ప్రస్తుతం ఆ నిబంధన పాటించడం లేదని బాలాజీ అన్నారు. మచిలీపట్నంలో ఐస్ క్రీములు మిఠాయిలు పేర్లతో కల్తీ పదార్థాలు చేర్చి తయారు చేయడం వల్ల కూడా ప్రజలు తమ ఆరోగ్యాన్ని నష్టపోతున్నారని బాలాజీ అన్నారు.

మచిలీపట్నంలో అనేక పాఠశాల వద్ద డూప్లికేట్ పిల్లల స్వీట్లు అమ్మి సొమ్ము చేసుకుంటున్న పట్టించుకునే అధికారి లేడని బాలాజీ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే హెల్త్ ఆఫీసర్ పదవి గత 24 నెలలు పైగా ఖాళీగా ఉందని బాలాజీ అన్నారు. హెల్త్ ఆఫీసర్ నియామకంపైమేయర్ మరియు ఇతర కార్పొరేటర్లు కూడా స్పందించవలసిన అవసరం ఉందని బాలాజీ అన్నారు. తక్షణమే హెల్త్ ఆఫీసర్ ని నియమించి మచిలీపట్నం ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని లేకపోతే రాష్ట్ర హైకోర్టు ద్వారా న్యాయపోరాటం చేయవలసి వస్తుందని బాలాజీ జిల్లా కలెక్టర్ కి తెలియజేశారు