🔴 కోనసీమ జిల్లా : జొన్నాడ : ది డెస్క్ :

జొన్నాడ ప్రధాన కాలువలో చెత్తాచెదారం నిండి ఉండడాన్ని చూసి దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన నీటి సంఘం అధ్యక్షులు గారపాటి శ్రీనివాస్ చౌదరి.
ప్రధాన కాలువలో అటుగా వెళ్లేవారు కానీ స్థానికులు గాని ఎవరైనా చెత్తాచెదారం వేస్తూ ఉంటే ఫోటో తీసి నాకు పంపించాలని…అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని గారపాటి కఠినంగా చెప్పారు.
ఈ విషయంపై ప్రతినెల ప్రభుత్వం మూడో శనివారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తుందని.. అయినా ప్రజల్లో మార్పు లేక అవగాహన లేక కాలువల్లో ఇలాంటి చెత్త చెదారం చేయడం వల్ల నీటి ప్రవాహానికి అటంకంగా ఉంటుందని నీరు వాతావరణం పొల్యూటెడ్ అవుతాయని కాబట్టి మన పరిసరాలు మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలని గారపాటి హితవు పలికారు.

