🔴 అల్లూరి జిల్లా : రంపచోడవరం : బి.వెలమలకోట : ది డెస్క్ :

పంచాయతీ ఎక్సటన్షన్ టు షెడ్యూల్ ఏరియా యాక్ట్ (పీసా యాక్ట్) అమలులోకి వచ్చి 29 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా…రంపచోడవరం ఐటిడిఏ పరిధిలోని బి. వెలమలకోట గ్రామానికి చెందిన ఉపాధిహామీ పథకం శ్రామికులు ‘పీసా’ అక్షరమాలలో శుభాకాంక్షలు తెలిపారు.

రంపచోడవరం డ్వామా, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సారథ్యంలో జరిగిన ఈ ‘పీసా’ అక్షరమాల కార్యక్రమానికి ఉపాధి శ్రామికుల నుంచి విశేష స్పందన రాగా 1996 సంవత్సరంలో ఏర్పడిన పీసా చట్టం ద్వారా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో స్థానిక సుపరిపాలనకు, గిరిజన ప్రాంతం అభివృద్ధిపై స్వీయ నిర్ణయాలు తీసుకునే హక్కు ఆదివాసీలకు ఉంటుందని ఏపీడీ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకం పనులు పరిశీలించి, కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ‘జీ రామ్ జీ’ విధానాన్ని వివరించి గ్రామీణ శ్రామికులతో ముచ్చటించారు.
“PESA” Letters Mark 29 Years of Tribal Empowerment
To commemorate 29 years of the Panchayats (Extension to Scheduled Areas) Act (PESA Act), MGNREGA workers in B. Velamalakot village, under Rampachodavaram ITDA, spelled out “PESA” with letters conveying best wishes.
The event, led by DWAMA Assistant Project Director T. Srinivas Vishwanath, drew enthusiastic participation. Enacted in 1996, PESA empowers tribal areas with local self-governance and development decisions, Vishwanath explained.
He later inspected MGNREGA works and discussed the Centre’s new ‘Jee Ram Jee’ policy with rural laborers.

