🔴 ఏలూరు జిల్లా : ద్వారక తిరుమల మండలం : ద్వారకాతిరుమల : ది డెస్క్ :

ద్వారకా తిరుమల షణ్ముఖ ఫంక్షన్ హాల్ నందు ఈరోజు రితిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025 సంవత్సరంనకు గాను సోషల్ సర్వీస్ కేటగిరిలో ముదినేపల్లికి చెందిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, డాక్టర్ మనోజ్ లకు నంది అవార్డులను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా అంబుల వైష్ణవి మాట్లాడుతూ..
అమరావతి పునర్నిర్మాణానికి, మన భావితరాల భవిష్యత్తు కొరకు అమరావతికి జీవం పోద్దాం – 116/- సాయం చేద్దాం అనే కాన్సెప్ట్ తో 100 కోట్ల రూపాయలు విరాళాలు సేకరించాలని తన తండ్రి డాక్టర్ మనోజ్ మరియు వైష్ణవి అనే నేను కృత నిశ్చయముతో ఉన్నామని..CRDA అకౌంట్ ద్వారా ప్రతి ఒక్కరూ 116/- రూపాయలు విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
మాకున్న దానిలో పొలము మరియు బంగారము అమ్మి అమరావతి నిర్మాణానికి అందించామని గుర్తు చేస్తూ… ప్రతి ఒక్కరూ మీ వంతులో సాయం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి మాట్లాడుతూ..
కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్.. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండటంవల్ల అమరావతి అభివృద్ధికి ఎటువంటి డోకా లేదని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా లక్ష కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం త్వరలోనే జరుగుతుందని, అదేవిధంగా 116/- రూపాయలు కాన్సెప్ట్ అద్భుతంగా ఉందని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవిని అభినందించారు.


ఈ సందర్భంగా డాక్టర్ మనోజ్, అంబుల వైష్ణవిలను పలువురు అభినందించారు.
Ambala Vaishnavi and Dr. Manoj Honored with Nandi Awards for Social Service
In a inspiring ceremony at Dwaraka Tirumala’s Shanmukha Function Hall, Ritik Foundation presented the 2025 Nandi Awards in the social service category to Ambala Vaishnavi, Amaravati Brand Ambassador from Mudinepalli, and her father Dr. Manoj. The event celebrated their dedication to public welfare.
Vaishnavi, addressing the gathering, reaffirmed their resolve to raise ₹100 crore for Amaravati’s reconstruction through the “Amaravati ki Jeevam Poddam – 116/- Sayam Cheddam” campaign. “Everyone contribute ₹116 via CRDA account for our future generations,” she urged, recalling how they sold their farmland and gold to support the capital’s development. She appealed for collective contributions.
Former MLA Ghanta Murali praised the initiative, noting no hurdles to Amaravati’s growth under PM Modi’s central government and Andhra Pradesh’s double-engine setup. “With ₹1 lakh crore, Amaravati will soon rival world capitals. This ₹116 concept is brilliant,” he said, congratulating Vaishnavi.
Many attendees lauded Dr. Manoj and Vaishnavi for their philanthropy.

