The Desk…Palakollu : ఛాoబర్స్ డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

The Desk…Palakollu : ఛాoబర్స్ డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు

🔴 పగో జిల్లా : పాలకొల్లు : ది డెస్క్ :

డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ మరియు డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఆఫీసర్, భీమవరం వారి ఆదేశాల మేరకు యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు గంజాయి, నాటుసారా మరియు డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పాలకొల్లు ఛాoబర్స్ డిగ్రీ కళాశాలలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

సందర్భంగా పాలకొల్లు ఎక్సైజ్ సిఐ మద్దాల శ్రీనివాస్ మాట్లాడుతూ..

గంజాయి ఇతర మాదకద్రవ్యాల వల్ల ప్రజల ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై కలిగే చెడు ప్రభావాలను మరియు సమాజంపై అవి ఎటువంటి దుష్ప్రభావాలు కలుగజేస్తాయో విద్యార్థులలో అవగాహన కల్పించారు.

ఈ సమావేశంలో కళాశాల ఛైర్మన్, కళాశాల ప్రిన్సిపాల్, అడ్వయిజర్ మూర్తి, సీతారామారావు మరియు ఎక్సైజ్ ఎస్.ఐ., గోపు రఘు మరియు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Anti-Drugs Awareness Session at Palakollu College.

In a proactive step towards a drug-free Andhra Pradesh, the Prohibition and Excise Department organized an awareness program on ganja and narcotics control at Chambers Degree College here today. Held under the action plan directives from Deputy Commissioner, Assistant Commissioner Eluru Enforcement, and District Prohibition Excise Officer, Bhimavaram, the session targeted students.

Excise CI Maddala Srinivas highlighted the severe health and mental impacts of drugs on individuals and society, urging vigilance.

College Chairman, Principal, Advisor Murthy, Sitaramaraju, Excise SI Gopu Raghu, staff, and students attended.