- ఉయ్యూరు మున్సిపాలిటిలోని షాదిఖానాలో జరిగే శుభాకార్యల నిమిత్తం ప్రజల నుండి వచ్చే సొమ్ము మున్సిపల్ చైర్మన్, కమీషనర్ జేబుల్లోకి..!!
- తగిన విచారణకై మున్సిపలాశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ కు పిర్యాదు చేసిన స.హ.చట్టం కార్యకర్తలు
- ఉయ్యూరు విచిత్రమైన మున్సిపాలిటి ➖ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్
కృష్ణాజిల్లా : ఉయ్యూరు : ది డెస్క్ :

ఉయ్యూరు మున్సిపాలిటి పరిధిలోని వాసవి నగర్ లో ఒక కోటిన్నర మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులతో నిర్మించిన ముస్లిం షాదిఖానాలో గత 18 నెలలుగా అనేక శుభకార్యాలు, వివాహాలు, నిమిత్తం రోజు వారీ అద్దె రూ.15,000/-లు చొప్పున వసూలు చేస్తున్న మున్సిపాలిటీ రెవిన్యూ ఇన్స్పెక్టర్ కె.చెన్నకేశవరావు ఆ అద్దె సొమ్మును మున్సిపాలిటికి జమ చేయటం లేదు. ఆ అద్దె సొమ్మును మున్సిపాలిటి చైర్ పర్సన్ వల్లభనేని సత్యన్నారాయణ(నాని), మున్సిపల్ కమీషనర్ల్ కైంకర్యం చేస్తున్నారు. గత 18 నెలలుగా 125 పైగా శుభకార్యాలు జరిగి రూ.18,75,000/- అద్దె నిమిత్తం వసూలు చేసి మున్సిపల్ చైర్మన్, స్వాహా చేశారు. ఒక పైసా కూడా మున్సిపాలిటికి జమ చేయలేదు. ఈషాదిఖానాకు ప్రతినెలకు సుమారు 35 వేలకు పైగా కరెంటు బిల్లు, వస్తుండగా మున్సిపల్ నిధుల నుండి కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు.
షాదిఖానాకు ముస్లిం సామాజిక పెద్దలచే కమిటిని వేయకుండా మున్సిపల్ చైర్మన్, కమీషనర్లు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ కె.చెన్నకేశవరావు అద్దె సొమ్మును స్వాహా చేస్తున్నారు.125 శుభాకార్యాల నిమిత్తం రూ.18,75,000/- (పద్దెనిమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు) అద్దె వచ్చింది. ఈవిషయమై తగిన విజిలెన్స్ విచారణ కొరకు రాష్ట్రమున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ కు,స.హ. చట్టం కార్యకర్తలు జంపాన శ్రీనివాస గౌడ్, బేతపూడి జోగేశ్వరరావు, సాకే రాములమ్మ పిర్యాదు చేయగా ముఖ్యకార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ విచారణకు ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

