The Desk…Eluru : ఏలూరు ఎంపీ నివాసంలో ఐటీ మంత్రి నారా లోకేష్..

The Desk…Eluru : ఏలూరు ఎంపీ నివాసంలో ఐటీ మంత్రి నారా లోకేష్..

🔴 ‎ఏలూరు/ఢిల్లీ : ది డెస్క్ :

ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం రాత్రి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాసానికి వచ్చారు. లోకేష్ తో పాటు వచ్చిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఇతర టీడీపీ ఎంపీలకు పుట్టా మహేష్ కుమార్ తన నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఎంపీలందరితో కలిసి కాసేపు సరదాగా గడిపిన లోకేష్ డిన్నర్ ముగిసిన అనంతరం ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశయ్యారు.

‎సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, సమస్యలపై ఎంపీలతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఈ సందర్భంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తర్వాత వివిధ సమస్యలపై ఆర్ధిక, వాణిజ్య, రైల్వే మంత్రులను కలిసిన విషయాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్  నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు తెలియచేశాయి.

కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ మరియు సహచర ఎంపీలు పాల్గొనడం జరిగింది.


Nara Lokesh at Eluru MP’s residence.

TDP National General Secretary and State IT and Education Minister Nara Lokesh, who is on a visit to Delhi, visited the residence of Eluru MP Putta Mahesh Kumar on Monday night. Putta Mahesh Kumar hosted a dinner at his residence for Lokesh and the accompanying Union Ministers Rammohan Naidu and Pemmasani Chandrasekhar, along with other TDP MPs. After spending some time informally with all the MPs, Lokesh held a separate meeting with them after dinner.

It is learned that during this meeting, he discussed the funds, projects, and issues that the state needs to receive with the MPs. On this occasion, MP Putta Mahesh Kumar informed Nara Lokesh about his meetings with the Finance, Commerce, and Railway Ministers regarding various issues after the commencement of the Parliament’s winter session, according to the MP’s office sources.

Union Ministers Shri Kinjarapu Rammohan Naidu, Shri Pemmasani Chandrasekhar, and other fellow MPs participated in this event.