The Desk…Bhimavaram : ఈ ఏడాది శ్రీ మావుళ్ళమ్మ ఆలయానికి అదనపు ఆదాయం➖ ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్

The Desk…Bhimavaram : ఈ ఏడాది శ్రీ మావుళ్ళమ్మ ఆలయానికి అదనపు ఆదాయం➖ ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో కొబ్బరి చెక్కలు, చీరలు పోగు చేసుకునే హక్కులకు సంబంధించి.. రెండు సంవత్సరాల కాలపరిమితికి వేలం పాటలు నిర్వహించగా…రెండు సంవత్సరాల పాటు కొబ్బరిచెక్కలు పోగుచేసుకునేందుకు 50,61,000/- లభించింది..కాగా గత పాట 28,45,000/- ఈసారి 22,16,000/- అదనంగా వచ్చినదని మరియు చీరలు జాకెట్ ముక్కలు మరియు పట్టుచీరలు ప్రోగుచేసుకునే హక్కుకు గత రెండు సంవత్సరాలు కాలానికి.. 1.21,27,500/-, కాగా.. ప్రస్తుతం జరిపిన వేలం పాటలో రెండు సంవత్సరాల కాలానికి 1.49.80,000/- లభించింది.

కాగా ఈసారి 28.52.500/- అదనముగా వచ్చినదని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. ఈ వేలం పాటలో దేవదాయ ధర్మదాయ భీమవరం ఇన్స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో జరిగాయని తెలిపారు. దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరడం వల్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

additional revenue through auctioning

The Mavullamma temple in Bhimavaram has earned substantial additional revenue through auctioning rights to collect coconut husks and ceremonial textiles. According to temple assistant commissioner Budda Mahalakshmi Nagesh, the two-year contract for collecting coconut husks fetched ₹50,61,000, an increase of ₹22,16,000 over the previous bid of ₹28,45,000.

Similarly, auction of rights to collect sarees, blouse pieces and silk sarees offered by devotees brought in ₹1,49,80,000 for a two-year period, up from ₹1,21,27,500 earlier, adding ₹28,52,500 in extra income. The auctions were conducted under the supervision of Endowments Department inspector V. Venkateswara Rao. Devotees and locals welcomed the enhanced revenue to the shrine.