🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
గునుపూడి గ్రామంలో వేంచేసి యున్న శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామివారి నిత్యాన్నదానం ట్రస్టునకు చినమిరం వాస్తవ్యులు బుద్ధర్రాజు లక్ష్మీ సరస్వతి, బుద్ధర్రాజు రామరాజు పేరున అన్నదానం చేయుటకు రూ.1,00,116/-లు విరాళంగా అందజేశారు.
కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు మరియు ధర్మకర్తల మండల సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.

