🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :
అధికారులకు కమిషనర్ యేసుబాబు ఆదేశం
ఈ నెల 30న జరగనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ యం. యేసుబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్‌లో ఎలక్షన్, అడిషనల్ ఎలక్షన్, అసిస్టెంట్ ఎలక్షన్ అధికారులతో కౌంటింగ్ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు.
కౌంటింగ్ సిబ్బంది విధులు, ఎన్నికల నిబంధనలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించి, ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ డి. భవానీ బాబు, మున్సిపల్ ఇంజనీర్ వై. వెంకటరమణ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

