🟡 ఏలూరు జిల్లా : ఏలూరు/ జంగారెడ్డిగూడెం : ది డెస్క్ న్యూస్ :
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సోమవారం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం కొత్త చైర్ పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళుతూ మార్గమధ్యలో మద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వామివారిని దర్శించుకున్న ఎంపీకి ఆలయ కమిటీ చైర్మన్ రాజన పండు, ఈఓ, ఆలయ పండితులు స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ పండితులు ఎంపీకి స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికలను అందించి ఆశీర్వదించారు.

