The Desk … Tadepalligudem : ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం.. 23న ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు

The Desk … Tadepalligudem : ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం.. 23న ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ న్యూస్ :

తాడేపల్లిగూడెం పురపాలక సంఘం చైర్‌పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేందుకు ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు తెలిపారు.

ఈ నెల 23న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పురపాలక సంఘ కార్యాలయంలో ఈ కేంద్రం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల విధుల ఉత్తర్వుల కాపీతో పాటు ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు లేదా పాన్ కార్డుల్లో ఏదో ఒక గుర్తింపు పత్రాన్ని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు.