🔴 ఎన్టీఆర్ జిల్లా : జగ్గయ్యపేట : ది డెస్క్ న్యూస్ :

రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం
జగ్గయ్యపేట వాగ్దేవి కళాశాలలో ఈ నెల 23న ఇంటర్వ్యూలు
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో ఈ నెల 23న సోమవారం ఉదయం 9 గంటలకు జగ్గయ్యపేటలోని వాగ్దేవి మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన 18 నుంచి 35 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వేతనంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు నైపుణ్యం పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకోవాలి. రెజ్యూమ్, ఆధార్, పాన్‌కార్డు, విద్యార్హత ధ్రువపత్రాల జిరాక్స్ ప్రతులతో ఇంటర్వ్యూకు హాజరుకావాలి.


వివరాలకు :
వాగ్దేవి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుస్సా సురేష్ (98488 37557),
కరస్పాండెంట్ బుస్సా సరిత (85004 79404, 90149 43757)ను సంప్రదించాలని జిల్లా ఉపాధి, నైపుణ్యాధికారులు సి. మధుభూషణ్‌రావు, ఎస్. శ్రీనివాసరావు తెలిపారు.

