The Desk … Eluru : టయోటా కార్ల షోరూమ్ ప్రారంభం..

The Desk … Eluru : టయోటా కార్ల షోరూమ్ ప్రారంభం..

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :

షోరూమ్ ప్రారంభించిన ఎమ్మెల్యే, మేయర్

నగరంలోని మినీ బైపాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన టయోటా షోరూమ్‌ను ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ రెడ్డి అప్పలనాయుడు శుక్రవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ :

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఏలూరులో అడుగుపెట్టడం నగర వ్యాపార, వాణిజ్య రంగాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అత్యాధునిక కార్ల విక్రయాలు, నాణ్యమైన సేవలు స్థానికులకు అందుబాటులోకి రావడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో షోరూమ్ యాజమాన్య ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.