🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు : ది డెస్క్ న్యూస్ :
ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సన్నద్ధం
విధుల నిర్వహణపై దిశానిర్దేశం
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేదు
➖ జి.ఆర్. మనోజ్ (ఎంపీడీవో, సహాయ రిటర్నింగ్ అధికారి)
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి విధులపై ఎన్నికల అధికారులకు శుక్రవారం (నవంబర్ 20) శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
స్థానిక పాతూరి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ శిక్షణకు 191 మంది ప్రిసైడింగ్ అధికారులు, 214 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు కలిపి మొత్తం 405 మంది హాజరుకానున్నారు.
ఎన్నికల విధులకు నియమితులైన ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా శిక్షణకు హాజరుకావాలని, ఎవరికీ మినహాయింపు లేదని ఎంపీడీవో, సహాయ రిటర్నింగ్ అధికారి జి.ఆర్. మనోజ్ స్పష్టం చేశారు.

