The Desk … Eluru : ఈవీఎం అయినా.. బ్యాలెట్‌ అయినా.. ప్రజా తీర్పు కూటమికే

The Desk … Eluru : ఈవీఎం అయినా.. బ్యాలెట్‌ అయినా.. ప్రజా తీర్పు కూటమికే

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం : ది డెస్క్ న్యూస్ :

పల్లెపోరులోనూ కూటమి మద్దతుదారులను గెలిపించాలి

నగరాల్లోనైనా.. పల్లెల్లోనైనా కూటమిదే జోరు

స్థానిక ఎన్నికల్లో ప్రజా మద్దతు కూటమికే

పల్లెపోరులోనూ అదే తీర్పు పునరావృతం కావాలి

గ్రామీణ ఓటర్లకు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపు

ఎన్నికల విధానం ఏదైనా ప్రజల మద్దతు కూటమికేనని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. నగర, పుర, పరిషత్‌ ఎన్నికల్లో కూటమికి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఏలూరు పవర్‌పేటలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.

మీడియా సమావేశంలో ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి మద్దతుదారులను భారీ మెజార్టీలతో గెలిపించాలని గ్రామీణ ఓటర్లను కోరారు.

2021 స్థానిక ఎన్నికల్లో వైసీపీ పాలనలో జరిగిన దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులను ప్రజలు మరచిపోలేదన్నారు. రెండు తీవ్ర తుఫాన్లను సమర్థంగా ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వం పాలనా సామర్థ్యాన్ని నిరూపించుకుందని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఒకే పాలన కొనసాగితేనే అభివృద్ధి వేగవంతమవుతుందని, పేదలకు మరింత మేలు జరుగుతుందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేలా ప్రజలు చైతన్యంతో ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు చోడే వెంకటరత్నం, మాజీ డిప్యూటీ మేయర్‌ కర్రి శ్రీనివాస్‌, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.