The Desk … Velerupadu : పొన్నవరం సర్పంచ్ బరిలో కడియాల పద్మ.. కూటమి బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

The Desk … Velerupadu : పొన్నవరం సర్పంచ్ బరిలో కడియాల పద్మ.. కూటమి బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ నియోజకవర్గం : వీరులపాడు : ది డెస్క్ న్యూస్ :

నామినేషన్‌తో ఎన్నికల సమరానికి శ్రీకారం

మండలంలోని పొన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన కడియాల పద్మ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలోని స్వర్ణ గ్రామ పంచాయతీ నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో ఎన్నికల అధికారికి పత్రాలు సమర్పించారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు కడియాల నరసింహారావు (చిన్న) సతీమణి అయిన పద్మ, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆశీస్సులతో ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఆమెకు మద్దతు తెలిపారు.