🔴 పగో : తాడేపల్లిగూడెం : ది డెస్క్ న్యూస్ :
POలు, APOలకు ఎన్నికల విధులపై శిక్షణ
ఎన్నికల విధుల్లో అప్రమత్తతే కీలకం
బ్యాలెట్ బాక్సుల భద్రతపై ప్రత్యేక శిక్షణ
నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణే లక్ష్యం
పారదర్శక పోలింగ్‌కు కమిషనర్ యేసుబాబు ఆదేశం
ఈ నెల 26న జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారులు (PO), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు (APO) గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ ఎలక్షన్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ యం. యేసుబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల విధివిధానాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ :
పోలింగ్‌కు ముందస్తు ఏర్పాట్లు, బ్యాలెట్ బాక్సుల పరిశీలన, సీలింగ్, ఓటర్ల గుర్తింపు, ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సుల భద్రత, తరలింపు తదితర అంశాలను వివరిస్తూ..విధుల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా, ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ డి. భవానీ బాబు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ జి. సీతారాం, టౌన్ ప్లానింగ్ అధికారి వి. జగదీశ్వరరావు, వార్డు మేనేజర్ నాగరాజు, ట్రైనర్లు, POలు, APOలు పాల్గొన్నారు.

