The Desk … Tadepalligudem : నామినేషన్ల ఉపసంహరణ గడువు పొడిగింపు

The Desk … Tadepalligudem : నామినేషన్ల ఉపసంహరణ గడువు పొడిగింపు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికలు:

పోటీలో 251 మంది అభ్యర్థులు

తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న చైర్‌పర్సన్ మరియు వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నం 3:00 గంటల వరకు వివిధ వార్డులకు సంబంధించి మొత్తం 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

మొత్తం 48 వార్డులకు గాను వివిధ స్థానాల నుంచి 261 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, నేడు 10 మంది తప్పుకున్నారు. దీంతో ప్రస్తుతం బరిలో మొత్తం 251 మంది అభ్యర్థులు నిలిచారు.

నేటితో ముగియనున్న గడువు :

నామినేషన్ల ఉపసంహరణకు రేపు (నవంబర్ 19, 2026) మధ్యాహ్నం 3:00 గంటల వరకు తుది గడువు ఉందని కమిషనర్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విత్‌డ్రా ఫారాలపై సంతకాలు చేసి ఎన్నికల అధికారికి అందజేయాలని సూచించారు.

అలాగే, రాజకీయ పార్టీల తరఫున అధికారిక గుర్తింపు కోసం ‘ఫామ్-బి’ (Form-B) సమర్పించాల్సిన అభ్యర్థులు కూడా రేపు మధ్యాహ్నం 3:00 గంటలలోపు ఎన్నికల అధికారికి అందజేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత సమయం లోపు పత్రాలు సమర్పించిన వారిని ఆయా పార్టీల తరఫున పోటీలో ఉన్న అధికారిక అభ్యర్థులుగా ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.