The Desk …Pedapadu : పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన

The Desk …Pedapadu : పంచాయతీ ఎన్నికలపై పోలీసుల అవగాహన

🔴 ఏలూరు జిల్లా : పెదపాడు : ది డెస్క్ న్యూస్ :

ప్రలోభాలకు లొంగొద్దు

ప్రశాంత ఎన్నికలకు సహకరించండి

ఓటుకు నోటు వద్దు

ప్రశాంతతే ముద్దు

ఎన్నికల వేళ సంయమనం పాటించాలి

గ్రామంలో ప్రశాంతతే లక్ష్యం

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

➖ఆర్ శ్రీనివాస్ (పెదపాడు ఎస్ఐ)

రానున్న పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని పెదపాడు ఎస్‌ఐ ఆర్. శ్రీనివాస్ సూచించారు. ఏలూరు ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ పర్యవేక్షణలో, పెదవేగి సీఐ సి.హెచ్. రాజశేఖర్ సూచనలతో వెంపాడు గ్రామంలో ఎన్నికల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ :

ఎన్నికల్లో కుల, మత, రాజకీయ విభేదాలకు తావివ్వకుండా గ్రామంలో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలన్నారు. ఓటర్లను డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం, ఘర్షణలకు దిగడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు చేయరాదని సూచించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.