🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

సీసీ రోడ్లు, పార్కుకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన
పట్టణ మౌలిక వసతుల అభివృద్ధే లక్ష్యంగా రూ.19 కోట్ల హెచ్‌ఏఎం నిధులతో చేపడుతున్న పనుల్లో భాగంగా 7, 8, 9వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి, గోవర్ధన గార్డెన్స్‌లో నూతన పార్కు ఏర్పాటుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. రహదారులతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కుల అభివృద్ధికీ ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

మెగా వైద్య శిబిరం ప్రారంభం – నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం :
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ డీవీఆర్ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. రక్తదానంతో ప్రాణాలను కాపాడవచ్చని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో స్వచ్ఛ ఆసుపత్రి అవార్డు పొందిన ఆసుపత్రి సిబ్బందిని, ఉత్తమ నర్సు అవార్డు గ్రహీతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

