The Desk … Bhimavaram : హుండీ ఆదాయం రూ.33.27 లక్షలు

The Desk … Bhimavaram : హుండీ ఆదాయం రూ.33.27 లక్షలు

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ న్యూస్ (ఆధ్యాత్మికం) :

హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీ

నాలుగున్నర కాసుల బంగారం, 14 తులాల వెండి

మావుళ్లమ్మవారి దేవస్థానంలో 40 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.33,27,757 నగదు లభించింది. భక్తులు సమర్పించిన హుండీల్లో అమెరికా 50 డాలర్లు, సింగపూర్‌ 2 డాలర్లు, మలేషియా 5 రింగిట్లు, యూఏఈ 10 దిర్హామ్ల విదేశీ కరెన్సీ లభించింది. అలాగే 35.200 గ్రాముల బంగారం, 144 గ్రాముల వెండి లభించినట్లు దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ బుద్ధ మహాలక్ష్మి నగేష్‌ తెలిపారు.

సింగరాయపాలెం శ్రీ వల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆర్‌.గంగాశ్రీదేవి పర్యవేక్షణలో హుండీల లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, చైర్మన్‌ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు, దేవదాయ శాఖ తనిఖీదారు పి.ఎస్‌.సాయికుమారి, యూనియన్‌ బ్యాంకు సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.