🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

అధికారుల పరిశీలన
ఆక్రమణల తొలగింపుపై దృష్టి
పట్టణాభివృద్ధికి రహదారుల విస్తరణ ఎంతగానో దోహదపడుతుందని రాజమహేంద్రవరం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (టౌన్ ప్లానింగ్) జి.వి.సుబ్బారావు అన్నారు. మంగళవారం పట్టణంలోని ఛత్రపతి శివాజీ సెంటర్ నుంచి గణేష్‌నగర్ వరకు జరుగుతున్న రహదారి విస్తరణ పనులను కమిషనర్ ఎం.యేసుబాబుతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిపై టౌన్‌ప్లానింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం ఎంఆర్‌ఓ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్ వరకు జూబ్లీ రోడ్డును పరిశీలించి, రహదారి విస్తరణకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పట్టణంలోని భవన నిర్మాణాలను తనిఖీ చేసి, ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్, సర్క్యులేషన్ ప్యాటర్న్స్ రికార్డులను పరిశీలించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారులను ఆక్రమించి ర్యాంపులు, కారుషెడ్లు నిర్మించకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీటీపీ ఆర్.జ్యోత్స్న, ఏసీపీ జి.శీతారం, టీపీఓ వి.జగదీశ్వరరావు, వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ పాల్గొన్నారు.

