The Desk… Tadepalligudem : చీపురు పట్టిన కమిషనర్‌

The Desk… Tadepalligudem : చీపురు పట్టిన కమిషనర్‌

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో స్వచ్ఛతా సేవ

స్వచ్ఛత హి సేవ–2026 లో భాగంగా.. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆదివారం శశి వాకర్స్‌ గ్రౌండ్‌లో శుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు స్వయంగా చీపురు పట్టి సిబ్బందితో కలిసి గ్రౌండ్‌ను శుభ్రం చేశారు. పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు.

వాకర్స్‌కు పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యమని కమిషనర్‌ తెలిపారు. ప్రజలు కూడా చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, వాకర్స్‌, స్థానికులు పాల్గొన్నారు.