🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

భక్తిశ్రద్ధల మధ్య అన్నదానం
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు నగరంలోని సాయి నగర్, కొత్తూరు ఇందిరమ్మ కాలనీ ఫేజ్-1లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలకు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. వినాయక చవితి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. పండుగ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పేర్కొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని పెంపొందించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి సంప్రదాయమని తెలిపారు.
కార్యక్రమాల్లో EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, మాజీ ఎంపీటీసీ అంబటి రజనీకుమార్, నాయకులు గూడవల్లి వాసు, బొమ్మిడి సత్యనారాయణ, కాగితాల రాంబాబు, దాసరి గణేష్, గంగడ్ల సంజు, టుమారోతు శ్రీనివాసరావు, అట్టాడ జగదీష్, వీర తదితరులు పాల్గొన్నారు. స్థానికులు, భక్తులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాల్లో పాల్గొని అన్నదానాన్ని విజయవంతం చేశారు.

