🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ న్యూస్ :
కేడర్ మధ్య సమన్వయానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్
స్థానిక పోరుకు కూటమి శ్రేణులు సమైక్యంగా సిద్ధం కావాలి
ఒకే మాట.. ఒకే బాట
స్థానిక పోరులో ‘కూటమి’ సమరం
ఏలూరు జిల్లాను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం
➖నాదెండ్ల మనోహర్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయభేరి మోగించేందుకు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు సమైక్య శైలిలో ముందుకు సాగాలని జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన కూటమి నాయకుల సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ :
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమి నేతల మధ్య ఎటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడటానికి ఏలూరు కేంద్రంగా 24/7 పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో మూడు పార్టీల ప్రతినిధులు అందుబాటులో ఉంటారన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఎటువంటి మనస్పర్థలకు తావివ్వకుండా, ఏకతాటిపై నిలిచి ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

