The Desk … Tadepalligudem : ముంపు ప్రాంతాల్లో కమిషనర్‌ పర్యటన.. డ్రైనేజీ బ్లాకేజీల తొలగింపునకు ఆదేశాలు

The Desk … Tadepalligudem : ముంపు ప్రాంతాల్లో కమిషనర్‌ పర్యటన.. డ్రైనేజీ బ్లాకేజీల తొలగింపునకు ఆదేశాలు

🔴 పగో జిల్లా : తాడేపల్లిగూడెం : ది డెస్క్ :

తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పట్టణంలో ముంపు ప్రాంతాలను స్పెషల్‌ గ్రేడ్‌ కమిషనర్‌ ఎం. యేసుబాబు గురువారం పరిశీలించారు. భీమవరం, తణుకు, ఏలూరు రోడ్లతో పాటు మార్కెట్‌, కబేళా తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్లపై నిలిచిన వర్షపు నీరు, డ్రైనేజీ బ్లాకేజీలను పరిశీలించారు. నీరు సాఫీగా వెళ్లేలా జేసీబీలు, సిబ్బందితో వెంటనే బ్లాకేజీలు తొలగించాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్‌, కబేళా పరిసరాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

పాత వస్తువులు ఇస్తే.. అవసరార్థులకు ఉపయోగం

ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ పిలుపు :

స్వచ్ఛత హి సేవ–2026లో భాగంగా పట్టణంలోని 9వ వార్డు ఆర్‌ఆర్‌ఆర్‌ (Reduce, Reuse, Recycle) కేంద్రంలో పాత వస్తువుల సేకరణ చేపట్టారు. కమిషనర్‌ ఎం. యేసుబాబు ఆధ్వర్యంలో ప్రజల నుంచి పాత బట్టలు, బొమ్మలు, పుస్తకాలు తదితర వస్తువులను స్వీకరించారు. పనికిరాని వస్తువులను చెత్తలో వేయకుండా ఆర్‌ఆర్‌ఆర్‌ కేంద్రాలకు అందించాలని, వాటిని అవసరమైన వారికి అందించి పునర్వినియోగం చేసే అవకాశం ఉందని కమిషనర్‌ తెలిపారు.