The Desk … Vijayawada : పాఠశాల బస్సు డ్రైవర్లదే కీలక బాధ్యత

The Desk … Vijayawada : పాఠశాల బస్సు డ్రైవర్లదే కీలక బాధ్యత

🔴 విజయవాడ : ది డెస్క్ :

పాఠశాల విద్యార్థులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో బస్సు డ్రైవర్ల బాధ్యత అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. డ్రైవర్లు నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ, రహదారి భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

బెంజ్‌సర్కిల్‌లోని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ హాల్‌లో జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల బస్సు డ్రైవర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డ్రైవర్లు విధిగా యూనిఫాం ధరించాలని, డ్రైవింగ్‌ నైపుణ్యంతో పాటు సహనం, సమయపాలన, మంచి ప్రవర్తన, వాహన నిర్వహణపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు శిక్షణ పొందాలని తెలిపారు.

విద్యార్థుల భద్రత కోసం పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు, రవాణాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా రవాణాశాఖ అధికారి ఎం.పురేంద్ర, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, అధికారులు, సిబ్బంది, పాఠశాల బస్సు, టాక్సీ డ్రైవర్లు పాల్గొన్నారు.