The Desk …Nandigama : నందిగామకు రూ.22 కోట్ల అభివృద్ధి పనులు

The Desk …Nandigama : నందిగామకు రూ.22 కోట్ల అభివృద్ధి పనులు

🟡 ఎన్టీఆర్ జిల్లా : నందిగామ : ది డెస్క్ :

టెండర్‌ దశకు చేరిన కీలక ప్రాజెక్టులు

నందిగామ రూపురేఖలు మార్చే పనులు

రోడ్లు.. వెలుగులు.. పార్కు.. కొత్త భవనం

అభివృద్ధి బాటలో నందిగామ

నందిగామ పట్టణ అభివృద్ధికి రూ.22 కోట్లకు పైగా విలువైన పనులు టెండర్‌ దశకు చేరుకున్నాయని ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. మున్సిపల్‌ అధికారులు పనుల వివరాలను ఆమెకు అందజేశారు.

హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.19 కోట్లతో సుమారు రూ.3 కోట్లతో నూతన మున్సిపల్‌ కార్యాలయ భవనం, 15 కి.మీ.కు పైగా సీసీ రోడ్లు, గాంధీ సెంటర్‌–రామన్నపేట మార్గంలో సెంట్రల్‌ డివైడర్‌, లైటింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రైతుపేట గోవర్ధన్‌ గార్డెన్స్‌లో అర ఎకరంలో పబ్లిక్‌ పార్కు అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.

అదనంగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3.40 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, కల్వర్టులు, తాగునీటి సరఫరా మెరుగుకు పైప్‌లైన్లు, మునేరు వద్ద కొత్త బోర్లు ఏర్పాటు చేయనున్నట్లు సౌమ్య వెల్లడించారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేసేలా పర్యవేక్షిస్తానని తెలిపారు.