The Desk …Tanuku : నిమజ్జనంలో నిబంధనలు పాటించాలి

The Desk …Tanuku : నిమజ్జనంలో నిబంధనలు పాటించాలి

🔴 పగో జిల్లా : తణుకు టౌన్ : ది డెస్క్ :

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు

నిమజ్జనంలో హద్దు దాటితే చర్యలు

డీజేలకు నో.. అశ్లీలతకు చెక్‌

నిమజ్జనం ప్రశాంతంగా జరగాలి

టౌన్‌ సిఐ

వినాయక నిమజ్జన కార్యక్రమాలను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని తణుకు టౌన్‌ సీఐ మండపాల నిర్వాహకులకు సూచించారు. నిమజ్జన ఊరేగింపుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

▪️నిమజ్జన ఊరేగింపుల్లో అశ్లీల నృత్యాలు, అసభ్యకర ప్రదర్శనలు నిర్వహించరాదు.

▪️మహిళలు, బాలికలను ఇబ్బందులకు గురిచేసే కార్యక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు.

▪️డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగానికి అనుమతి లేదు.

▪️ఊరేగింపుతో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

▪️మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనడం, గొడవలు చేయడం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం నిషేధం.

▪️నిర్వాహకులు, భక్తులు పోలీసుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.

▪️నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తూ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని తణుకు టౌన్‌ సీఐ కోరారు.