The Desk… Eluru : బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పిస్తాం

The Desk… Eluru : బీసీలకు మరింత ప్రాతినిధ్యం కల్పిస్తాం

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు ఎంపీ కార్యాలయం : ది డెస్క్ :

స్థానిక ఎన్నికలను సద్వినియోగం చేసుకోవాలి

➖ఎంపీ పుట్టా మహేష్‌

బీసీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా తనవంతు కృషి చేస్తానని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఏలూరు ఎంపీ కార్యాలయంలో యాదవ, గౌడ, ఇతర బీసీ వర్గాల నాయకులు, యువకులు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. ఏలూరు రూరల్ బీసీ సంఘం జిల్లా కమిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సద్వినియోగం చేసుకుని బీసీలకు మరింత రాజకీయ ప్రాతినిధ్యం సాధించాలని ఎంపీ సూచించారు. బీసీలకు తగిన భాగస్వామ్యం కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం బీసీ సంఘాల నాయకులు ఎంపీని శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో నేటూరి గోపాలకృష్ణ, సీహెచ్‌ సురేష్, నాగమల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.