🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :
“పనితీరులో చంటి సిక్సర్.. ర్యాంకుల్లోనూ సిక్స్!”
మాటలకే పరిమితం కాకుండా.. చేతల్లో పనితీరు చూపించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. ఎమ్మెల్యేల పనితీరును ఆధారంగా చేసుకుని నిర్వహించిన మూల్యాంకనంలో 6వ ర్యాంకు సాధించారు
ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాల్లో చూపిన పనితీరుకు ఈ ర్యాంకు నిదర్శనంగా నిలిచింది. “పనితీరులో చంటి సిక్సర్.. ర్యాంకుల్లోనూ సిక్స్!” అంటూ టీడీపీ శ్రేణులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తూ.. ప్రజల మన్ననలు అందుకుంటున్నారని పేర్కొంటున్నారు.

