The Desk … Eluru : ప్రాణ రక్షణే లక్ష్యంగా “ఫ్లాష్‌ సేవలు”.. 5 వేల మంది దాతల భాగస్వామ్యంతో అత్యాధునిక అంబులెన్స్‌ ➖ఎమ్మెల్యే చంటి ప్రశంస

The Desk … Eluru : ప్రాణ రక్షణే లక్ష్యంగా “ఫ్లాష్‌ సేవలు”.. 5 వేల మంది దాతల భాగస్వామ్యంతో అత్యాధునిక అంబులెన్స్‌ ➖ఎమ్మెల్యే చంటి ప్రశంస

🟡 ఏలూరు జిల్లా : ఏలూరు : ది డెస్క్ :

దాతల సేవలను ప్రాణరక్షణ బాధ్యతగా మలచిన ఫ్లాష్‌ సంస్థ ఆలోచనలు ఆదర్శనీయమని టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ కొనుగోలులో 5 వేల మంది దాతలను భాగస్వాములను చేయడం అభినందనీయమన్నారు.

ఏలూరు అశోక్‌నగర్‌లోని కెపిడిటి హైస్కూల్‌ ప్రాంగణంలో ఫ్లాష్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏఎల్‌ఎస్‌ అంబులెన్స్‌ ఐసీయూ వైద్య పరికరాల శిక్షణ, ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కో-ఆర్డినేటర్‌ సునీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. అంబులెన్స్‌లోని వివిధ విభాగాలు, వైద్య పరికరాల పనితీరును సునీల ఎమ్మెల్యేకు వివరించారు.

సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ :

ప్రజాసేవ పట్ల ఫ్లాష్‌ సంస్థ చూపుతున్న చొరవ అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సంస్థ చేపట్టే సేవా కార్యక్రమాలకు తన సంపూర్ణ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.