The Desk … Vunguturu : వెళ్ళమల్లిలో పింఛన్ల పంపిణీ

The Desk … Vunguturu : వెళ్ళమల్లిలో పింఛన్ల పంపిణీ

🔴 ఏలూరు జిల్లా : ఉంగుటూరు మండలం : ది డెస్క్ :

పింఛన్ల పంపిణీని పరిశీలించిన ఎంపీడీఓ మనోజ్

సామాజిక భద్రతకు పింఛన్లు భరోసా

వెళ్ళమల్లి పంచాయతీలో ఎంపీడీఓ పర్యటన

వెళ్ళమల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఉంగుటూరు మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) జి.ఆర్. మనోజ్ పాల్గొని పింఛన్ల పంపిణీ ప్రక్రియను పరిశీలించి స్వయంగా… పింఛన్లు పంపిణీ చేశారు.

ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సకాలంలో చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

పింఛన్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలను ఎంపీడీఓ మనోజ్ అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

వెళ్ళమల్లి పంచాయతీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తో పాటు స్థానిక నాయకులు, పంచాయతీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు. అదే విధంగా పలు గ్రామాలలో పంచాయతీ ప్రత్యేక అధికారులు కూడా పాల్గొని, పెన్షన్స్ పంపిణీ చేసారు